చిరుధాన్యాలతోనే మన ఆరోగ్యం సంరక్షించబడుతుంది : డా.ఖాదర్​వలీ

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 5:14 PM IST

thumbnail

Khadar Vali on Millets for Global Food Security : మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటేనే పరిష్కారం లభిస్తుందని ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్​వలీ అన్నారు. చిరుధాన్యాలతోనే మన ఆరోగ్యం సంరక్షించబడుతుందని తెలిపారు. హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లోని మేనేజ్ కార్యాలయంలో ఏషియా ఆఫ్రికన్‌ రూరల్‌ డెవలప్​మెంట్‌ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో తృణధాన్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది.

International Year of Millets 2023 : నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు దాదాపు 30 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. చిరుధాన్యాలపై ఇతర దేశాలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఖాదర్​వలీ తెలిపారు. తృణధాన్యాల వినియోగం వల్ల ఆహార కొరతనే మాట ఉండదని, ఆహార సార్వభౌమత్యం వెనుకకు వస్తుందని ఖాదర్​వలీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్​గా ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని భారత్ నేతృత్వం వహించడం గమనార్హ విషయం. సదస్సులో వివిధ చిరుధాన్యాలకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.