కేదార్​నాథ్ ఆలయ తలుపులు మూసివేత- మరో 6నెలల పాటు శివయ్యకు అక్కడే పూజలు!

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 3:03 PM IST

Updated : Nov 15, 2023, 4:56 PM IST

thumbnail

Kedarnath Dham Temple Doors Closed : ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు మూసివేశారు. అట్టహసంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  
కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఏటా దీపావళి పండుగ రెండు రోజుల తర్వాత మూసివేస్తారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆలయ తలుపులను మూసేశారు. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

బుధవారం ఉదయం 8 గంటలకు ఆలయ పూజారులు మంత్రాలను పఠిస్తూ.. తలుపులను మూసివేశారు. ఆలయం తెరిచే కార్యక్రమంలాగే.. మూసివేసే కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. తలుపులు మూసివేసే సమయంలో హర హర​ మహాదేవ్​ అంటూ భక్తులు నామస్మరణ చేశారు. 

భక్తి శ్రద్దలతో శివయ్య పంచముఖీ దేవత విగ్రహం శ్రీ ఓంకారేశ్వరాలయం, ఉఖీమఠ్​కు తీసుకుని వచ్చారు. ఆ సమయంలో జై బోలో శంకర్ నినాదాలు చేస్తూ వేలాది మంది భక్తులు స్వామివారి వెంట నడిచారు. వచ్చే 6 నెలల పాటు ఉఖీమఠ్‌లోనే శివయ్యకు పూజలు నిర్వహించనున్నారు. 

Last Updated : Nov 15, 2023, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.