కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎంపై రాళ్ల దాడి.. తలకు గాయం.. పది రోజుల్లోనే రెండోసారి!

By

Published : Apr 28, 2023, 10:50 PM IST

thumbnail

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్​ నేత జి. పరమేశ్వర తలకు గాయమైంది. ప్రచారంలో భాగంగా రోడ్​ షో నిర్వహిస్తున్న ఆయనపై.. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. తుమకూరు జిల్లాలోని కొరటగెరె నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. బైరెనహళ్లి ప్రాంతంలో కొందరు కార్యకర్తలు పరమేశ్వరను భుజాలపై ఎత్తుకుని సంబరాలు చేస్తున్నారు. ఆయనపై పూల వర్షం కురిపిస్తూ.. జేసీబీ సాయంతో గజమాల వేశారు. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి.. పరమేశ్వరపై రాళ్లతో దాడి చేశాడు. దీంతో ఆయన తలకు గాయమైంది. దీంతో పరమేశ్వర తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే అక్కడున్న వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్​కు తరలించారు. అనంతరం పరమేశ్వరకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. పరమేశ్వర.. కొరటగెరె నియోజక వర్గం నుంచే కాంగ్రెస్​ పార్టీ తరుపున ఎన్నికల బరిలో దిగారు. గతంలో ఆయన కేపీసీసీ చీఫ్​గాను పనిచేశారు. అంతకుముందు కూడా పరమేశ్వరపై రాళ్ల దాడి జరిగింది. ఆయన నామినేషన్​ పత్రాలు సమర్పించేందుకు ర్యాలీగా వెళుతున్న సందర్భంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై రాళ్ల దాడి చేశాడు. ఆ సయయంలో పరమేశ్వరకు ఎటువంటి గాయం కాలేదు. కానీ ఓ మహిళ కానిస్టేబుల్​ తీవ్రంగా గాయపడింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.