Warangal rains Mayor reaction : "ముంపు ప్రజలను.. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాము"

By

Published : Jul 26, 2023, 7:55 PM IST

thumbnail

Floods in warangal : భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న వరంగల్‌లోని పలు కాలనీలు వరద గుప్పిట్లోనే వణుకుతున్నాయి.  డీకే నగర్, ఎన్టీఆర్​ నగర్, గణేశ్​నగర్, సంతోషిమాతా నగర్, వివేకానందకాలనీ, సుందరయ్యనగర్​లు వరద ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రాంత ప్రజలను వరంగల్ మహానగర పాలక సంస్థ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారాన్ని అందిస్తున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ పరిధిలో మొత్తం ఎనిమిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిన్నటితో పోలిస్తే వివేకానంద కాలనీ, సాయిగణేష్ కాలనీ, సంతోషిమాత నగర్ కాలనీలలో వరద ఉద్ధృతి తగ్గింది. నగరంలోని చప్పల్‌ బజార్‌కు పోటెత్తిన వరదతో అక్కడ నివాసం ఉండే ప్రజలతో పాటు.. వ్యాపారులు అష్టకష్టాలు పడుతున్నారు. వరంగల్​ మేయర్‌ గుండు సుధారాణి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. విపత్తు వేళ ప్రజలకు ఎలాంటి తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామంటున్న.. వరంగల్‌ మేయర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.