హెచ్‌సీయూలో ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించిన సీఎం - విద్యార్థులతో కలిసి సరదాగా ఆటను ఆడిన రేవంత్‌ - CM REVANTH PLAYS FOOTBALL VIDEO

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 11:56 AM IST

thumbnail
విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడిన రేవంత్‌ (ETV Bharat)

Revanth Plays Football in HCU Video Viral : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి బ్రేక్‌లు పడ్డాయి. దీంతో నేతలు రిలాక్సేషన్‌ మూడ్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మైకులు మూగబోవడంతో ఇవాళ ఉల్లాసంగా గడిపారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూవర్సిటీలో ఎర్పాటు చేసిన ఫుట్‌బాల్ పోటీలను సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరదాగా ఫుట్‌బాల్‌ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. చదువుతో పాటు ఆటల్లోనూ సత్తా చాటాలని రేవంత్‌రెడ్డి అన్నారు. క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి ఎంతో మంచిదని ఆయన పేర్కొన్నారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆటలో పాల్గొన్నారు. వీరి ఆటను అక్కడున్న వారంతా ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.