TSIC CIO: 'గ్రామాల్లో ఉన్న ఆవిష్కర్తలను గుర్తించడమే ముఖ్య లక్ష్యం'

By

Published : Apr 22, 2023, 6:03 PM IST

thumbnail

TSIC CIO Santa Tautam Interview: కొత్త ఆలోచనతో ముందుకొచ్చే వారికి మేము ఉన్నామని అంటోంది.. తెలంగాణ ప్రభుత్వం. వినూత్న ఆలోచనలతో వారి ప్రతిభను నిరూపించుకునే ఔత్సాహికులకు.. సహకారం అందించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టింది. వినూత్న ఆలోచనలకు ఊతమిచ్చేందుకు, గ్రామాల్లో ఉన్న ఆవిష్కర్తలను గుర్తించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రతి గ్రామంలో ఎన్ అవర్‌ ఫర్ ఇన్నోవేషన్‌ కార్యక్రమంగా నిర్వహించనున్నారు. దీనికి ఐరాస ఎంచుకున్న థీమ్‌ "స్టెప్‌ అవుట్‌ అండ్‌ ఇన్నోవేట్‌". ఇంటింటా ఇన్నోవేటర్‌కు మే నెలలో దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఈ క్రమంలోనే నూతన ఔత్సాహికులు ఏదైనా ఆవిష్కరిస్తే తమకు వాట్సప్‌లో పంపాలంటున్నారు సీఐవో శాంతా తౌటమ్. వాట్సప్‌ చేయాల్సిన నంబర్‌ 9100 678 543. ఎక్కువ సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని.. ఆవిష్కరణలపై.. గ్రామీణ స్థాయిలో ప్రజలకు, యువతకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతోన్న టీఎస్​ఐసీ.. ఆవిష్కర్తలకు అండగా నిలుస్తామని అంటోంది. మరి, ఇన్నోవేటర్లను గుర్తించడానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మరిన్ని విశేషాలను మనకు తెలియజేస్తున్న.. రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటమ్​తో.. ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.