Himayath sagar gates are lifted : హిమాయత్​నగర్​ ఆరు గేట్లు ఎత్తివేత.. సర్వీస్ రోడుపైకి వరద నీరు

By

Published : Jul 22, 2023, 8:02 PM IST

thumbnail

Himayath sagar gates are lifted : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. పై నుంచి ఇంకా ప్రవాహం వస్తుందన్న సమాచారంతో.. నిన్న సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జలమండలి అధికారులు.. హిమాయత్ సాగర్ 2 గేట్లను ఒక్కో ఫీటు వరకు ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. ఈ రోజు కూడా జలాశయానికి వరదనీరు పెరగడంతో మరో రెండు గేట్లు ఎత్తారు. సాయంత్రం మరో రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 3500 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 4200 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి సాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1763 అడుగులుగా ఉంది. 6 గేట్లు ఎత్తడంతో హిమాయత్ సాగర్ నుండి రాజేందర్​నగర్ వెళ్లే సర్వీస్ రోడుపైకి వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలు నిలిపేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.