Hero Nikhil at school opening in Kondapur : 'క్రీడాకారులు నిజమైన హీరోలు.. మేము రీల్ హీరోలం'
Published: May 21, 2023, 3:38 PM

Hero Nikhil at school opening in Kondapur : హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో సినిమా హీరో నిఖిల్ సందడి చేశారు. కొండాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ నాల్గో బ్రాంచ్‌ను నిఖిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశం కోసం పోరాడి మెడల్స్ సంపాదించి పెడుతున్న క్రీడాకారులు నిజమైన హీరోలను అభివర్ణించారు. తాము రీల్ హీరోలమని నిఖిల్ చెప్పుకొచ్చారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పిల్లలు, పెద్దలు బయట ఎక్కువగా తిరగొద్దని ఆయన సూచించారు. మంచి నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇచ్చారు. తన సినిమాలను ఎంతగానో ఆదరిస్తోన్న అభిమానులకు నిఖిల్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన కొత్త సినిమా స్పై గురించి పలు విషయాలు వివరించారు. అన్ని సినిమాల మాదిరిగానే స్పై మూవీ కూడా ఆదరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత చిన్నపిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి సరదాగా ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుందాంశ్, స్కూల్ డైరెక్టర్లు, సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.