జలదిగ్బంధంలో పాతబస్తీ.. బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు ప్రజలు

By

Published : May 4, 2022, 10:44 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

ఇవాళ ఉదయం కురిసిన కుండపోత వర్షానికి పాతబస్తీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాకుత్‌పురా నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ధోబీఘాట్ ప్రాంతంలో ఇళ్లు నీట మునగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలను బోట్ల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారు. జీహెచ్​ఎంసీ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మదీనా నగర్, ధోబీఘాట్, తలాబ్ కట్ట, బహదూర్​పురా నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు అయిన మక్కా కాలనీ, బిలాల్ నగర్, చంద్రాయణ్​గుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ, శివ గంగా నగర్, అరుంధతి కాలనీ ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.