Goreti Venkanna Interview : 'అప్పుడు ఊరిడిచిన తెలంగాణ.. ఇప్పుడు పచ్చగా కళకళలాడుతోంది'

By

Published : Jun 5, 2023, 2:00 PM IST

thumbnail

Goreti Venkanna Interview on Telangana decade celebrations : ఒకప్పుడు ఉపాధి లేక ఊరిడిచిన తెలంగాణ పల‌్లెలు ఇప్పుడు పచ్చని చెలకలతో కళకళ లాడుతున్నాయంటున్నారు కవి, గాయకుడు డాక్టర్‌ గోరేటి వెంకన్న. పొట్ట చేతబట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసపోయిన తెలంగాణ సమాజం నేడు ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కల్పవృక్షమయ్యిందని అన్నారు. ఉద్యమ అకాంక్షల్ని సుసాధ్యం చేస్తూ నేడు తెలంగాణ ముందుకు అడుగేస్తోందనీ హర్షం వ్యక్తం చేశారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయనీ తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా 24 గంటలు విద్యుత్​ రాష్ఠ్రంలో ఉంటుందని వెల్లడించారు. తాను పల్లే విధ్వంసం అయినప్పుడు ఓ పాట రాశారని.. అలాంటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో అసలు లేవని గోరెటి వెంకన్న అన్నారు. పదవులు, అవార్డుల ప్రభావం తన రచనలపై లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది సంబురాల వేళ సహజ కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నతో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.