గోల్డెన్​ టెంపుల్​ గణేశుడికి రూ.8 కోట్ల బంగారు కిరీటం.. ఎంత ముచ్చటగా ఉందో!

By

Published : Jul 29, 2023, 8:46 AM IST

Updated : Jul 29, 2023, 9:48 AM IST

thumbnail

Gold Crowning Lord Ganesh Idol : తమిళనాడు వెల్లూర్‌లోని ప్రసిద్ధ శ్రీపురం గోల్డెన్‌ టెంపుల్‌లోని శ్రీశక్తి గణపతి శిరస్సుపై అరుదైన కిరీటాన్ని అలంకరించారు. నవరత్నాల్లో ఒకటైన సైమోఫేన్‌ అనే రత్నాన్ని బంగారు కిరీటంలో పొదిగారు. ఆ సైమోఫేన్‌ 880 క్యారెట్లున్న ఒకే రత్నం కావడం విశేషం. ఆ సైమోఫేన్‌ ధర 8 కోట్ల రూపాయల వరకు ఉంటుందని దేవస్థానం బోర్డు తెలిపింది. ప్రజలు ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించాలని వినాయకుడికి కోరుకున్నామని పేర్కొంది.  

శ్రీపురంలోని గోల్డెన్‌ టెంపుల్‌ నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయం బంగారం రంగులో మెరిసిపోతుంది. ఆలయ మధ్య గోపురాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం స్వర్ణకారులు బంగారంతో నిర్మించారు. ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. 1,500 కిలోల బంగారాన్ని ఆలయ కట్టడంలో వినియోగించారని సమాచారం. ఈ గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలోనే.. 1,700 కిలోల వెండితో తయారుచేసిన శక్తి వినాయకుడి విగ్రహన్ని 2021లో ప్రతిష్ఠించారు. తెల్లటి రంగులో ఈ విగ్రహం ఉంటుంది.  

Last Updated : Jul 29, 2023, 9:48 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.