Pratidwani : మెట్రో విస్తరణ... ప్రజా రవాణ అవసరాలు

By

Published : Jul 11, 2023, 9:35 PM IST

thumbnail

Pratidwani : హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మరోవైపు ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న ఎంజీబీఎస్, ఫలక్​నుమా మెట్రో పనులను కూడా చేపట్టాలని కేటీఆర్​ ఆదేశించడంతో.. అధికారులు దీనిపై కూడా దృష్టిసారించారు. 10 కిలోమీటర్ల ఈ మార్గం ఎక్కువగా పాతబస్తీ మీదుగానే వెళ్తుంది. అక్కడ చాలా వరకు ప్రార్థనా మందిరాలు ఉండటం, వాటిని మార్చే వీలులేకపోవడం, అలైన్​ మెంట్ మార్చిచే ఖర్చు పెరుగుతుందని ఎల్​ అండ్ టీ ఈ మార్గంలో పనులు ఆపేసింది. ఇప్పుడు కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ పనులను పూర్తి చేసేందుకు ఉత్సాహం చూపడం కాస్త ఊరటనిచ్చే అంశం. మరోవైపు విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలో ప్రజారవాణా చాలా కీలకంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ప్రైవేట్ వాహనాలతో భాగ్యనగరం రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్ సిస్టమ్ మెరుగుపడితేనే ప్రజల రవాణాకు ఇబ్బందులు తొలగుతాయి. అందుకే ఇందులో ఉన్న అడ్డంకులేంటి.. మెట్రోతోనే మన సమస్యలు తీరుతాయా.. ఎంఎంటీఎస్, ఆర్టీసీ పరిస్థితి ఏంటి.. ఈ అంశాలపై ఇవాళ్టి ప్రతిధ్వనిపై చర్చిద్దాం.. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.