అప్పుల బరువు... కష్టాల దరువు

By

Published : Mar 9, 2023, 9:41 PM IST

thumbnail

etv pratidwani discussion: ఒకవైపు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు.., మరోవైపు డిఫాల్టర్ల లిస్టుల్లో చేరుస్తున్న బ్యాంకులు! ఇవి మాత్రమే కాదు.. ఈరోజు సాగుభారంగా మారిన రైతన్నలను వేధిస్తున్న సమస్యలు ఎన్నో... ఏటికేటా గుదిబండలుగా మారుతున్న ఆ భారాన్ని మోసేదెలా అన్న దారే వారికి కనిపించడం లేదు. కూలీలు, చేతివృత్తుల వారి పరిస్థితి మరింత దయనీయం. ఇంటిల్లపాది... సంవత్సరమంతా చేసిన కష్టం ప్రైవేటు అప్పులు వడ్డీలకే పోతుంటే.. బతుకుబండి నడిచేదెలానో దిక్కుతోచక రుణవిముక్తి కమిషన్‌కు మొర పెట్టుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఈ సమస్య ఎందుకు తీరడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న రుణభారాన్ని రైతులకు విముక్తి కల్పిచడంలో ప్రభుత్వాలు, బ్యాంకులు, అధికారులు, నిపుణులు ఎందుకు వెనకబడుతున్నారో అర్థం కావడం లేదు. రైతు అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పే నేతలకు ఆ అన్నదాతల గోస ఎప్పుడు అర్థమవుతుందో తెలియదం లేదు. ఏటేటా పెరుగుతున్న ఈ అప్పుల బాధలు తీరేది ఎలా? రుణమాఫీ, పరపతి సాయం విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.