Etela Rajender: 'KCR ప్రజల్ని కాకుండా.. పైసలనే నమ్ముకున్నారు'

By

Published : Apr 20, 2023, 7:35 PM IST

thumbnail

Etela Rajender comments on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రజల్ని నమ్ముకున్నారని.. ఇప్పుడు మాత్రం డబ్బులపైనే ఆశలు పెట్టుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. సీఎం ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు, మద్యం, బిర్యానీతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చేవెళ్లలో ఈనెల 23న జరిగే  అమిత్‌షా బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ఈటల రాజేందర్ పరిశీలించారు. ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా రుణమాఫీ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తద్వారా లక్షలాది మంది అన్నదాతలు డిఫాల్టర్లుగా మారారని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదని విమర్శించారు. ఫలితంగా అతివృష్టి, అనావృష్టి కారణంగా.. రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ చెల్లించకుండా ముంచేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.