Chandrababu Fires on Minister Peddireddy: ఈ రోడ్డు మీ తాత జాగీరా.. పుంగనూరుకు మళ్లీ వస్తా: చంద్రబాబు

By

Published : Aug 4, 2023, 9:08 PM IST

Updated : Aug 4, 2023, 9:16 PM IST

thumbnail

Chandrababu Fires on Minister Peddireddy: టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో.. వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి యత్నించడంతో.. ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పుంగనూరులో జరిగిన విధ్వంసానికి పెద్దిరెడ్డే కారణమని దుయ్యబట్టారు. మళ్లీ పుంగనూరుకి వస్తానని.. పట్టణమంతా పర్యటిస్తానని చంద్రబాబు అన్నారు. 

పుంగనూరు రోడ్డు మీ తాత జాగీరా.. పుంగనూరు రోడ్డుపై నేను తిరగకూడదా అంటూ పెద్దిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పోయే పార్టీ అని.. ఆ పార్టీ నేతలకు పోగాలం వచ్చిందని విమర్శించారు. ప్రజలు తిరగబడితే మీరు పారిపోతారని హెచ్చరించారు. పుంగనూరు ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చల్లా బాబుపై దెబ్బపడితే నాపై పడినట్లేనని.. కార్యకర్తల నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కా.. నా నుంచి కారినట్లే చంద్రబాబు అన్నారు. నెత్తురోడుతున్నా నిలబడిన కార్యకర్తలను అభినందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 

మొన్నే పులివెందులలో పొలికేక వినిపించానని.. ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. పుంగనూరులో ఎన్నో అరాచకాలు జరిగాయని విమర్శించారు. అధికార పార్టీకి దాసోహం కావద్దని పోలీసులను కోరుతున్నానని సూచించారు. ఇవాళ్టి ఘటనలకు బాధ్యుడు ఎస్పీనే అని పేర్కొన్నారు. గాయపడిన కార్యకర్తలను జీపుపైకి పిలిపించుకున్న చంద్రబాబు.. గాయపడిన కార్యకర్తలను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. 

Last Updated : Aug 4, 2023, 9:16 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.