ముంపు ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తా - ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి
BRS Candidate Bandari Laxmareddy Interview : శాసనసభ ఎన్నికలు దగ్గర పడేకొద్ది.. బీఆర్ఎస్ ప్రచారాలు జోరందుకున్నాయి. అధికారమే లక్ష్యంగా.. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడపగడపకు తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది.. సంక్షేమ కార్యక్రమాలు.. తమను గెలిపిస్తాయని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి రాగానే ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కార దిశగా కృషిచేస్తానంటున్న ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డితో ముఖాముఖి.
BRS Election Campaign 2023 : గతంలో తెలంగాణ ఎలా ఉందో.. ప్రస్తుతం ఎలా ఉందో.. చూసి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. తనకు టికెట్ ఖరారు సమయంలో 100 పడకల ఆసుపత్రి నియోజక వర్గానికి తెచ్చానన్నారు. ఉప్పల్‌ను రెసిడెన్సియల్ ల్యాండ్‌గా మార్చానని తెలిపారు. రూ.50 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులను మెరుగుపర్చానని.. తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉప్పల్ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యే కాక ముందే ఇన్ని పనులు చేస్తే అధికారంలోకి వేస్తే మరిన్ని పనులు చేస్తానని బండారి లక్ష్మారెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నారు.