Chintala Ramachandra Reddy fires BRS : "ఇళ్లనిర్మాణ నిధుల అక్రమాలపై.. త్వరలో జన్​సున్వాయి"

By

Published : Jul 19, 2023, 4:44 PM IST

thumbnail

BJP leaders fires BRS on double bedroom houses : రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పేరుతో.. బీఆర్​ఎస్​ రూ.9 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఇందులో కీలక సూత్రధారులైన కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజాకోర్టులో నిలబెడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 6లక్షల 10వేల ఇళ్ల నిర్మాణానికి.. కేంద్రానికి నివేదిక ఇచ్చిందన్నారు. వీటికి కేంద్రం నుంచి 2 లక్షల 83వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం.. 17వేల కోట్లు రూపాయలను వివిధ రూపాల్లో  ఇచ్చిందని చింతల రామచంద్రారెడ్డి వివరించారు. కేంద్ర నిధుల నుంచి ఒక్కో బెడ్‌ రూముకు 6 లక్షలు ఖర్చు చేసిన 2లక్షల 83వేల ఇళ్లు పూర్తయ్యేవని.. ఎందుకు నిర్మించలేదని, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని నిలదీశారు. రేపు సోషల్ ​ఆడిట్ ఇన్‌స్పెక్షన్ "జన్​సున్వాయి" పేరుతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలిస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం.. ఈ నెల 24న అన్ని జిల్లా కలెక్టరేట్​ల వద్ద, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. పేదవారికి ఇళ్లు ఇచ్చేంత వరకు బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.