Bhatti Fires On Amit shah: 'బీజేపీ, బీఆర్​ఎస్ ఆటలు సాగనివ్వం'

By

Published : Apr 24, 2023, 2:21 PM IST

thumbnail

Bhatti Fires On Amit shah: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను  సీఎల్​పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. 9 ఏళ్లుగా అధికారంలో ఉన్నా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం వల్లే విచారణకు ఆదేశించట్లేదని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మండిపడ్డారు. 

భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఓ మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం చాలా బాధాకరమని భట్టి విక్రమార్క అన్నారు. ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు తొలగించి బీసీలకు కేటాయిస్తామని చెప్పడం దారుణమని మండిపడ్డారు. బీసీలపై ప్రేమ ఉంటే బీజేపీ, బీఆర్​ఎస్ ఎందుకు జనగణన చేయడం లేదని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర హన్మకొండ జిల్లా కమలాపూర్‌ నుంచి ప్రారంభమైంది. నేటిలో ఈ యాత్ర 39వ రోజుకు చేరుకుంది.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.