Badrinath Temple Telangana : తెలంగాణలో బద్రీనాథ్ ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?

By

Published : Jul 24, 2023, 2:09 PM IST

thumbnail

Badrinath Temple Siddipet : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ దేవాలయాన్ని పోలిన క్షేత్రాన్ని సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో నిర్మించారు. మంచు కొండల్లో కొలువుదీరి ఆరు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే బద్రీనాథ్​ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఎంతోమంది భక్తులు కలలు కంటుంటారు. ఆర్థిక స్తోమత గల వారు బద్రీనాథ్‌ వెళ్లి స్వామివారిని నేరుగా దర్శించుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేని వారికోసం ఓ సంస్థ బద్రీనాథ్ దేవాలయాన్ని పోలిన కోవెలను సిద్దిపేటలో నిర్మించింది. సహజంగా బద్రీనాథ్ ఆలయానికి వెళ్లడం కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఆలయం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. మరో ఆరు నెలలు మంచు ఎక్కువగా ఉండటంతో ఆలయాన్ని మూసేస్తారు. అక్కడ కొలువైన మహావిష్ణువును పూజించాలంటే ఒక విధంగా సాహస యాత్ర చేయాల్సిందే. ఈ ఆలయం జూన్ నెలలో ప్రారంభం కావడంతో ఇక్కడికి వచ్చే భక్తులు బద్రీనాథ్ క్షేత్రాన్ని చూసి ఆనందాన్ని పొందుతున్నారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహించే వేద పండితులు సైతం బద్రీనాథ్ నుంచి రావడం విశేషం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.