A Cheetah in a Cage at Nizamabad : బోనులో చిరుత ఎలా చిక్కిందో తెలుసా..!

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2023, 3:37 PM IST

thumbnail

A Cheetah in a Cage at Nizamabad : గత వారం రోజులుగా ఓ గ్రామంలోని ప్రజలు వారి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుందని తెలిసి.. భయంతో బిక్కు బిక్కుమంటూ జీవించారు. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సాంకేతికను ఉపయోగించి.. చిరుతని పట్టే పనిలో పడ్డారు. చివరికి వారు వేసిన పథకంలో చిరుత చిక్కింది. దీంతో ఆ గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. 

Cheetah in a Cage at Navipet : గ్రామస్థులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గుట్టపై గత వారం చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గమనించారు. దీంతో భయభ్రాంతికిలోనై గ్రామస్థులు.. అటవీ అధికారులకి సమాచారం ఇచ్చారు.  వారు వెంటనే అప్రమత్తమై.. ఆ గ్రామానికి వచ్చి చిరుత సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు. దీంతో చిరుతను(Cheetah) పట్టుకునేందుకు  ఆ ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు. వారం రోజులకు చిరుత బోనులో చిక్కింది. చిరుత చిక్కడంతో పరిసర గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.