బావిలో పడిన చిన్నారి- కాపాడిన 'వైట్ ​హెల్మెట్స్​'

By

Published : Feb 13, 2021, 7:27 PM IST

thumbnail

సిరియాలోని వైట్​ హెల్మెట్స్​ సహాయక బృందం.. ఓ చిన్నారి ప్రాణాలను కాపాడింది. తూర్పు అలెప్పో బాబ్​ పట్టణంలోని ఓ నీళ్లు లేని బావిలో బాస్మా అనే నాలుగేళ్ల బాలిక పడిపోయింది. ఆ బావిలో ఉన్న ఓ సొరంగంలో చిక్కుకుని చిన్నారి ఏడుస్తుండగా.. వైట్​ హెల్మెట్స్​ సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. తాళ్ల సాయంతో బావిలోకి దిగి బాస్మాను బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో చిన్నారికి ఎలాంటి గాయాలు కానప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.