లైవ్ వీడియో: ఉగ్రవాదుల గ్రనేడ్​ దాడి- ఒకరు మృతి

By

Published : Jun 26, 2021, 10:30 PM IST

Updated : Jun 27, 2021, 8:42 AM IST

thumbnail

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లోని బర్బార్షా ప్రాంతంలో ఉగ్రవాదులు శనివారం గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పౌరుడు మరణించగా.. ముగ్గురు గాయపడ్డారు. సీఆర్​పీఎఫ్​ సిబ్బంది, జమ్ముకశ్మీర్​ పోలీసులే లక్ష్యంగా సాయంత్రం ఆరు గంటలకు ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. రహదారి పక్కన ఈ గ్రనేడ్​ పేలిందని చెప్పారు. పేలుడు అనంతరం ఈ ప్రాంతంలో భద్రతాదళాలు భారీగా మోహరించారు. ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Last Updated : Jun 27, 2021, 8:42 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.