మెడలో కోబ్రాతో వృద్ధుడి విన్యాసాలు- ఒక్క కాటుతో...

By

Published : Oct 6, 2021, 7:36 PM IST

Updated : Oct 6, 2021, 7:53 PM IST

thumbnail

పొలంలో కనిపించిన భారీ తాచుపామును(King Cobra ) పట్టుకుని విన్యాసాలు చేస్తూ అదే పాము కాటుకు బలయ్యాడు ఓ వృద్ధుడు(man dies after playing with cobra ). ఈ సంఘటన అసోం, కాచార్​ జిల్లాలో జరిగింది. ధోలాయ్​ నియోజకవర్గం, బిష్నుపుర్​ గ్రామానికి చెందిన రఘునందన్​ భూమ్​జీ(60).. ఇంటి సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటుండగా.. భారీ పాము(King Cobra news) కనిపించింది. దానిని రఘునందన్​ మెడకు చుట్టుకుని గ్రామం మొత్తం తిరిగాడు. స్థానికులకు చూపుతూ విన్యాసాలు చేయబోయాడు. ఓ సందర్భంలో చేతి నుంచి జారిపోయిన కోబ్రా.. కాటు వేసింది. వెంటనే జిల్లాలోని సిల్చార్​ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

Last Updated : Oct 6, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.