Video viral: ఆటో ఢీ కొట్టి ఆమడ దూరంలో..

By

Published : Jul 13, 2021, 7:06 AM IST

thumbnail

కర్ణాటక బెంగళూరులో రోడ్డుపై వస్తున్న ఓ మహిళను ఆటో ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు దగ్గరలోని నిమన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను సంపంగిరామనగర్​కు చెందిన శశికళగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన విల్సన్​ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. తొలుత ఆ ఆటోను వేగంగా వచ్చిన ఓ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ కారణంగా ఆటో డ్రైవర్​ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ప్రమాదం జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.