ఏనుగుని కాల్చాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు!

By

Published : Mar 12, 2020, 12:47 PM IST

thumbnail

కర్ణాటక బందీపుర్​లో అభంశుభం తెలియని ఓ ఏనుగుపై కాల్పులు జరిపి ఉద్యోగం పోగొట్టుకున్నాడు అటవీ శాఖ తాత్కాలిక ఉద్యోగి రహీమ్. దారి తప్పివచ్చిన ఏనుగును తిరిగి అడవిలోకి పంపించాల్సిందిపోయి.. ఆపద సమయాల్లో మాత్రమే ఉపయోగించాల్సిన తుపాకీతో కాల్పులు జరిపాడు. నొప్పితో ఏనుగు విలవిల్లాడుతుంటే.. రాక్షసంగా నవ్వుతూ ఆనందించాడు. ఈ అమానవీయ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు మరో ఉద్యోగి ఉమేశ్​. విషయం అధికారుల దృష్టికి వెళ్లగానే చర్యలు చేపట్టారు. రహీమ్​ను విధుల నుంచి తప్పించారు. శాశ్వత ఉద్యోగి అయిన ఉమేశ్​పై విచారణకు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.