వరద ఉద్ధృతిలో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు- చివరకు!
Published on: Nov 21, 2021, 11:38 AM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కర్ణాటకలో భారీ వర్షాలు(Karnataka Rains) కురుస్తున్నాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తుమకూరులో ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వరద ఉద్ధృతిలోనే రోడ్డు దాటేందుకు ప్రయత్నించి.. బైక్‌తో సహా కొట్టుకుపోయాడు(biker swept away). కొద్ది దూరం వెళ్లి చిన్న ఆధారంతో పక్క గట్టుకు చేరుకోగలిగాడు. మరోబైక్‌ను వరద నుంచి లాగేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Loading...