12 సెకన్లలో రూ.1.25 లక్షలు విలువైన బంగారు గొలుసు చోరీ

By

Published : Feb 13, 2023, 2:45 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్ ఆగ్రాలోని ఓ నగల దుకాణంలో రూ.1.25 లక్షలు విలువైన బంగారు గొలుసు చోరీకి గురైంది. శనివారం నగల షాప్​కు భార్యాభర్తల్లా వచ్చిన ఇద్దరిలో ఓ మహిళ 12 సెకన్లలో బంగారు గొలుసును దొంగిలించింది. షాప్​కు వచ్చిన వెంటనే బంగారు గొలుసులు చూపించమన్న ఆ ఇద్దరు.. సేల్స్​మ్యాన్ దృష్టి మరల్చి చోరీకి పాల్పడ్డారు. వారిద్దరూ షాప్​ నుంచి వెళ్లిన తర్వాత సిబ్బంది ఆభరణాలను లెక్కించారు. అయితే వాటిలో ఓ బంగారు గొలుసు తక్కువగా ఉంది. దీంతో షోరూమ్​లో అమర్చిన సీసీటీవీలను పరిశీలించగా అసలు విషయం తెలిసింది. దీంతో నగల దుకాణం యజమాని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.