షాకింగ్​ వీడియో.. మహిళ మీద నుంచి దూసుకెళ్లిన వాటర్​ ట్యాంకర్.. అక్కడికక్కడే..

By

Published : Sep 6, 2022, 8:21 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను వెనుకనుంచి వాటర్​ ట్యాంకర్​ ఢీకొట్టింది. అనంతరం ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నగరంలోని లగ్గరె బస్టాండ్ సమీపంలో జరిగింది. మృతురాలిని ఆశ అనే మహిళగా గుర్తించారు. ఆమె కిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుందని, ఇంటికి వెళ్లే సమయంలో ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఫోన్​ చూసుకుంటూ డ్రైవర్ వాహనం నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటన తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఈ ఘటనపై రాజాజీ నగర ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.