తండ్రి ట్రైనింగ్​.. చీరకట్టులో కోట ఎక్కిన 8 ఏళ్ల చిన్నారి.. ఎవరెస్ట్​ పర్వతాన్ని కూడా!

By

Published : Jan 24, 2023, 5:48 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు సాహసయాత్రలకు సై అంటున్నారు. చీరకట్టులో ప్రమాదకరమైన జీవధాన్​ కోటను ఎక్కారు ఠానేకు చెందిన హరిత, 8 ఏళ్ల గృహిత. దీంతో కోట ఎక్కిన అతి పిన్నవయస్కురాలిగా గృహిత రికార్డ్​ సొంతం చేసుకుంది. వీరిద్దరూ తన తండ్రి సచిన్ విచారే ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. కొద్దిరోజుల క్రితం వారిద్దరు తమ తండ్రితో కలిసి మౌంట్​ ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్దమయ్యారు. అయితే 3,800 అడుగుల ఎత్తులో హరితకు ఆరోగ్యం దెబ్బతినగా.. తను వెనుదిరిగింది. దీంతో గృహిత, ఆమె తండ్రి సచిన్​లు కలిసి దిగ్విజయంగా ఎవరెస్ట్​ బేస్​ క్యాంపునకు చేరుకున్నారు. చలి, మంచు కారణంగా బేస్​ క్యాంప్​కు చేరుకోవడానికి వారికి 13 రోజుల సమయం పట్టింది. దీంతో మహారాష్ట్ర నుంచి ఎవరెస్ట్​ అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా గృహిత నిలిచింది. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.