ETV Bharat / t20-world-cup-2022

టీమ్ఇండియా విజయం కోసం​ పాకిస్థాన్ ప్రార్థనలు.. ఎప్పుడైనా చూశారా..?

author img

By

Published : Oct 30, 2022, 9:48 AM IST

దక్షిణాఫ్రికాతో పెర్త్​ వేదికగా జరగబోయే మ్యాచ్​లో టీమ్ఇండియా గెలవాలని పాకిస్థాన్ ప్రార్థనలు చేస్తోంది. ఇప్పుడు పాక్​ జట్టు గెలుపు కంటే.. భారత్​ గెలవడమే వారికి ముఖ్యం. ఎందుకంటే..

india match against south africa t20 world cup 2022
india match against south africa t20 world cup 2022

టీమ్‌ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతుంటే.. మన వాళ్ల విజయం కోసం పాకిస్థానీయులు ప్రార్థించడం ఎప్పుడైనా చూశారా? ఆదివారం ఆ అరుదైన దృశ్యమే చూడబోతున్నాం. ఎందుకంటే ఆ జట్టు సెమీస్‌ చేరడం భారత్‌ చేతుల్లోనే ఉంది. టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై గెలిచి ఆ జట్ల సెమీస్‌ అవకాశాలను దెబ్బ తీస్తేనే పాక్‌ ముందంజ వేయడానికి అవకాశముంటుంది.

భారత్‌, జింబాబ్వేల చేతుల్లో ఓడిన పాక్‌ ఇప్పుడు గ్రూప్‌-2లో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌లను ఓడించినా.. సమీకరణాలు కలిసి రాకుంటే పాక్‌కు సెమీస్‌ బెర్తు దక్కదు. అందుకే భారత్‌ మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాలని దాయాది జట్టు కోరుకుంటోంది. భారత్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ కంటే ముందు పెర్త్‌లోనే పాక్‌.. నెదర్లాండ్స్‌ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే దాయాది జట్టు సెమీస్‌ అవకాశాలకు తెరపడ్డట్లే.

ఇవాళ సాయంత్రం 4.30కు దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. ఇప్పటి వరకరూ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-దక్షిణాఫ్రికా 5 మ్యాచ్‌ల్లో తలపడగా.. నాలుగుసార్లు భారత్‌ నెగ్గితే, ఒక్కసారే దక్షిణాఫ్రికా గెలిచింది.

ఇవీ చదవండి : స్టన్నింగ్​ క్యాచ్​​.. గాల్లోకి ఎగిరి మరీ.. సచిన్ బంతిని భలే పట్టేశాడుగా!

'కోహ్లీ పరిపూర్ణ ఆటగాడు.. అది అతడికే మాత్రమే సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.