ETV Bharat / sukhibhava

ఈ మందులతో బరువు పెరిగే ఛాన్స్​ ఉందట.. జాగ్రత్త సుమా!!

author img

By

Published : Oct 7, 2022, 8:22 AM IST

Updated : Oct 7, 2022, 8:36 AM IST

medicine side effects
medicines

ఒంట్లో బాగోలేనప్పుడు మనం చేసే మొదటి పని మందులు వేసుకోవడం. చిన్నపాటి సమస్యలకు తాత్కాలిక పరిష్కారంగా కనిపించే ఈ మందులు దీర్ఘకాలంలో అనేక సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చినపుడు దానికి సంబంధించిన మందులు వేసుకోక తప్పదు. ఇపుడు మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్‌, క్యాన్సర్‌ లాంటి జబ్బులకు దీర్ఘకాలంగా మందులు వాడక తప్పదు. వీటితో పాటు పారాసిటామాల్‌, నొప్పి మాత్రలు, యాంటీబయోటిక్స్‌, ఇతర మందులు వేసుకోవడం ఎక్కువయ్యింది. ఇందులో కొన్ని మందులతో బరువు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వీటి తీరుతెన్నులు, పరిష్కార మార్గాల గురించి జనరల్‌ ఫిజిషియన్లు చెప్పిన కొన్ని విశేషాలు.

ఇవీ తేడాగానే ఉంటాయి..

  • కొన్ని బీపీ, షుగర్‌ మందులు ఒంటి బరువును పెంచుతాయి. మానసిక రుగ్మతల నివారణకు వాడే మందులతో కూడా బరువు పెరగొచ్చు.
  • పక్షవాతం, రుమాటైటీడ్‌, యాంటీఈస్టామెన్‌ మందులతో కూడా బరువు పెరుగుతారు.
  • గ్లూకోజ్‌ పెంచడానికి ఇచ్చే మధుమేహం మందులతో కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది.
  • మూర్ఛను తగ్గించే మందులకు ఆకలిని పెంచే గుణం ఉంటుంది. దాంతో ఎక్కువగా తినేస్తుంటారు.
  • జలుబు తగ్గించే సిట్రజిన్‌ మందు బిళ్లలు ఆకలిని, బద్దకాన్ని పెంచుతాయి. వీటితో కూడా బరువు పెరగక తప్పదని తెలుస్తోంది.
  • ఏ మందులు వాడినా సైడ్‌ఎఫెక్టు వచ్చినపుడు వెంటనే వైద్యులను కలుసుకోవాలి.దీంతో ఇతర అవసరమైన మందులను సూచించే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: రోజుకు ఎంత నీరు అవసరం? సరిపడా తాగుతున్నామో లేదో తెలుసుకోవడం ఎలా?

కంటి నిండా నిద్ర కావాలా నాయనా? అయితే 10-3-2-1 ఫార్ములా పాటించాల్సిందే!!

Last Updated :Oct 7, 2022, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.