ETV Bharat / sukhibhava

Vitamin K Benefits : 'విటమిన్-K' వల్ల ప్రయోజనాలేంటి?.. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?

author img

By

Published : Jun 26, 2023, 7:15 AM IST

Vitamin K Health Benefits : విటమిన్ల అన్నింటిల్లోనూ విటమిన్ కె శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. గుండెపోటు ముప్పును తగ్గించి.. రక్తస్రావాన్ని త్వరగా నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

vitamin-k-health-benefits-for-bones-vitamin-k-benefits-for-heart
విటమిన్ కె ఆరోగ్య ప్రయోజనాలు

Vitamin K Benefits In Telugu : ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన విటమిన్లు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. విటమిన్లు సరిగ్గా అందకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ల లోపం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. విటమిన్లలో 'విటమిన్ K'కు కూడా అధిక ప్రాధాన్యత ఉంది. విటమిన్ కె వల్ల ఉపయోగాలేంటి? ఆహారంలో ఎందుకు తప్పనిసరిగా తీసుకోవాలి? అనేది ఇప్పుడు చూద్దాం.

విటమిన్ కె అనేది శరీరానికి చాలా అవసరం. విటమిన్ కె లోపం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. రక్తం గడ్డకట్టడం, రక్తంలో క్యాల్షియం స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి విటమిన్ కె అవసరమవుతుంది.
విటమిన్ కె ప్రాథమిక ఆహాన వనరు విటమిన్ కె1. దీనిని ఫైలోక్వినోన్ అని కూడా పిలుస్తారు. మొక్కల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విటమిన్ కె మరో మూలం విటమిన్ కె2. దీనిని మెనాక్వినోన్ అని కూడా పిలుస్తారు. ఇవి జంతు ఆధారిత, పులియబెట్టిన ఆహారాల్లో లభిస్తుంది.

విటమిన్ కె లోపం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఈ విటమిన్ తక్కువ కావడం వల్ల అధిక రక్తస్రావం అవుతుంది. అదే విటమిన్ కె మీ శరీరంలో పుష్కలంగా ఉంటే ఏదైనా గాయమైనప్పుడు రక్తస్రావం కాకుండా రక్తం గడ్డం కట్టేలా సహాయపడుతుంది. ఇంకా విటమిన్ కె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఎముకల ఆరోగ్యం కోసం విటమిన్ కె
Vitamin K For Bones : విటమిన్ కె తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ధృఢమైన ఎముకల సంరక్షణకు ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. అలాగే ఎముకల సాంద్రతను మెరుగుపర్చడంతో పాటు పగుళ్ల ప్రమాదానికి తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం కోసం..
Vitamin K For Heart Attack : విటమిన్ కె గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ధమనుల్లో ఖనిజాలు ఏర్పడే మినరలైజేషన్‌ను విటమిన్ కె అడ్డుకుంటుంది. దీని వల్ల ధమనుల్లో రక్త ఒత్తిడిని తగ్గించడంలో ఈ విటమిన్ సహాయపడుతుంది. కరోనరీ గుండె ద్వారా రక్తాన్ని స్వేచ్చంగా పంప్ చేయడంలో ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది..
Heart Disease Vitamin K : విటమిన్ కె గుండెపోటు ముప్పును తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల చాలామంది గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. యువకులు కూడా హార్ట్‌స్ట్రోక్‌కు గురై నిమిషాల్లోనే చనిపోతున్నారు. విటమిన్ కె గుండెపోటు ముప్పును తగ్గిస్తుందని చెబుతున్నారు. విటమిన్ కె గుండెలో రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా..
Vitamin K Cancer Cure : అలాగే విటమిన్ కె క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నియంత్రిస్తుంది. దీని వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఈ విటమిన్ కాపాడుతుంది.

విటమిన్ కె కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలి?
Vitamin K Rich Foods : ఆకుకూరలు, క్యాబేజీ, పచ్చి బఠానీలు వంటి వాటిని తీసుకోవడం వల్ల విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. పాలకూర, తోటకూర, బచ్చలి, గోంగూర వంటి ఆకుకూరల్లో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది.

'విటమిన్ కె' వల్ల ప్రయోజనాలేంటి? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.