ETV Bharat / sukhibhava

ఆకలి వేయడం లేదా? ఇది చిటికెడు ట్రై చేయండి..

author img

By

Published : Oct 24, 2021, 8:00 AM IST

ఆహారంలో చిటికెడు ఇంగువను జతచేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆకలి లేకపోవడం లాంటి సమస్యలతోపాటు జీర్ణ సంబంధ వ్యాధులనూ ఇది తగ్గిస్తుంది. దీని వల్ల ఇంకా ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే చిటికెడు ఇంగువ లేకుండా మీరు వంటే చేయరు.

పులిహోర, చారు, రోటీ పచ్చళ్లు, కూరల్లో చిటికెడు ఇంగువ వేస్తే చాలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే ప్రతి వంటింటి పోపుల పెట్టెలో తప్పనిసరిగా ఉండే మసాలా దినుసు ఇది.

  • చెట్టు వేర్ల నుంచి లభించే ఇంగువ జీర్ణ రసాలు ఉత్పత్తి అవడానికి తోడ్పడుతుంది. ఎంజైమ్‌ల చర్యను ప్రభావితం చేస్తుంది. దీంట్లో ఔషధాల గుణాలూ ఎక్కువే.
  • ఇంగువలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, ఇనుము లాంటి మూలకాలతోపాటు కెరొటిన్‌, విటమిన్‌- బి, పీచు, మాంసకృత్తులు మెండుగా ఉంటాయి.
  • రోగనిరోధకతను పెంచే దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు.
  • అజీర్తి, కడుపులో మంట, అన్నం సరిగా జీర్ణమవకపోవడం లాంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే కూరల్లో చిటికెడు ఇంగువ చేర్చుకుంటే సరి. గ్లాసు మజ్జిగలో దీన్ని వేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఆకలి లేకపోవడం లాంటి సమస్యలతోపాటు జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.
  • అల్లం, ఇంగువ, తేనె సమ పాళ్లలో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది.
  • ఆస్తమా, దగ్గు లాంటివి నియంత్రణలో ఉండాలంటే ఇంగువను వంటల్లో చేర్చుకోవాల్సిందే.
  • తలనొప్పి, ఒళ్లు నొప్పులను తగ్గిస్తుంది.
  • నెలసరి సమయంలో తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనంగా ఉంటుంది.
  • దీంట్లో పలు రకాల యాంటీక్యాన్సర్‌ సమ్మేళనాలుంటాయి.
  • ఇంగువ వేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహులకూ మంచిది.

ఇదీ చదవండి: బ్రహ్మచర్యం శరీరానికి మంచిదేనా? జీవితకాలం పెరుగుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.