ETV Bharat / sukhibhava

Pimples Removal Tips : మొటిమలు, మచ్చలు ఎలా తగ్గించుకోవాలి? టూత్​పేస్ట్ రాయొచ్చా?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 3:21 PM IST

Pimples on Face Removal Tips : మీరు మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? వాటిని ఎలా తగ్గించుకోవాలో అర్థం కావడం లేదా? ఏం చేస్తే మొటిమల సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చో, అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Pimples on Face Removal Tips
ముఖం మీద మొటిమలను తొలగించే చిట్కాలు

Pimples on Face Removal Tips : చాలామందికి యుక్త వయసులో మొహంపై మొటిమలు ఏర్పడతాయి. వయసుతో సంబంధం లేకుండా కొందరిని ఈ సమస్య బాధిస్తుంది. ఇవి తగ్గిన తర్వాత కూడా ఒక్కోసారి మచ్చలుగా ఉండిపోతాయి. చర్మ రంధ్రాలు వాపునకు గురి కావడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మొటిమల సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మొటిమల సమస్య కోట్లాది మందిని వేధిస్తోంది. దీనిపై చాలామందికి అనేక అపోహలు ఉన్నాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతుంటారు. కొందరైతే సమస్యను మరింత తీవ్రతరం చేసుకుంటారు. మొటిమల సమస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొటిమల్ని గిల్లకూడదు..
Precautions for Pimples on Face : చాలామంది మొటిమల సమస్య ఉన్నప్పుడు వాటిని గిల్లుతారు. అలా చేయడం వల్ల వాపు పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. మచ్చలు కూడా ఏర్పడతాయి. నల్లటి మచ్చల వల్ల మొహం అందాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

టూత్ పేస్ట్ రాసుకోవడం సరైందేనా?
Pimples on Face Toothpaste : మొటిమలపై టూత్ పేస్ట్ రాసుకోవడం వల్ల నయం అవుతాయని చాలామంది భావిస్తుంటారు. టూత్ పేస్ట్ అనేది మొటిమల పరిష్కారం కోసం తయారు చేసింది కాదు. టూత్​పేస్ట్​లోని బేకింగ్ సోడా వంటి పదార్థాలు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. మొటిమలపై టూత్ పేస్ట్ రాసుకోవడం వల్ల ఇరిటేషన్ కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతిని పాటించకపోవడమే మంచిది.

మొటిమలు ఎవరిలో తీవ్ర ప్రభావం చూపుతాయి?
Pimples on Face Reason : మొటిమల సమస్య ఎవరికైనా రావచ్చు. కానీ కొంతమంది మొహం ఆయిలీగా ఉంటుంది. అలాంటి వారిని మొటిమల సమస్య ఎక్కువగా భాధిస్తుంది. ఆయిలీ ఫేస్ ఉన్నవారిలో మొటిమల సమస్య ఏర్పడడం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

శాశ్వతమైన మచ్చలు..
Acne and Pimples Removal : మొటిమల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయి. మొటిమలకు చికిత్స తీసుకోకపోవడం, గిల్లడం కారణంగా మచ్చలు ఏర్పడతాయి. కొన్ని మచ్చలు శాశ్వతంగా ఉండిపోతాయి. సరైన సమయంలో డెర్మటాలజిస్ట్​ను కలసి చికిత్స తీసుకుంటే సమస్యను పరిష్కరించుకోవచ్చు. మచ్చలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

తరచుగా మొహం శుభ్రంగా కడుక్కోవడం..
Face Wash Cause Pimples : సరైన చర్మ రక్షణ లేకపోవడం వల్ల కూడా మొటిమలు ఏర్పడతాయి. అందుకే చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం తరచుగా ఫేస్ వాష్ చేసుకోవాలి. మరి కొంతమంది అతిగా మొహం కడుక్కుంటూ ఉంటారు. ఇది కూడా సరికాదు. ఇలా చేయడం వల్ల మొటిమలపై రాపిడి పెరుగుతుంది. సమస్య పరిష్కారం కాకపోగా మరింత తీవ్రంగా మారుతుంది.

మొటిమలతో బాధపడేవారు చర్మవ్యాధుల నిపుణుల్ని సంప్రదించాలి. వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటిస్తే.. మొటిమల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు

Medicine During Pregnancy : సొంత వైద్యం వద్దు.. మందుల విషయంలో జాగ్రత్త.. గర్భిణీలకు నిపుణుల సలహాలు!

Eggs For Weight Loss : వేగంగా బరువు తగ్గాలా?.. కోడి గుడ్లను ఇలా తిని చూడండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.