ETV Bharat / sukhibhava

కండరాల నొప్పులు బాధిస్తున్నాయా? ఉల్లిపొట్టుతో చెక్​ పెట్టండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 10:56 AM IST

Onion Peel Benefits : ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ బాగా తెలుసు, కానీ మీరు చెత్తబుట్టలో పడేసే ఉల్లిపాయ పొట్టు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగ పడుతుందని మీకు తెలుసా..?

Onion Peel Benefits
Onion Peel Benefits

Onion Peel Health Benefits : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అయితే, ఇది కేవలం సామెత మాత్రమే కాదండోయ్‌. ఉల్లి ప్రయోజనాలకు సంబంధించి ఇప్పటికే అనేకం చూశాం. ఎన్నో పోషకాలు ఉన్న ఉల్లిపాయలను ప్రతి వంటింట్లో ఉపయోగిస్తారు. ఉల్లిపాయ లేని కూరలు అంత రుచిగా ఉండవని కూడా అంటుంటారు. అయితే, ఇప్పుడు ఉల్లిపొట్టుతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే మీరు అస్సలు నమ్మరు.. కానీ, ఇది నిజం.. ఉల్లిపొట్టుతో కలిగే లాభాలు తెలిస్తే.. ఇక మీదట దాన్ని పారేయకుండా దాచిపెట్టుకుంటారు.. ఎందుకంటే.. ఉల్లిపొట్టులో విటమిన్లు A, K, C పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి దీని ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం..

Health Benefits of Onion Peel:

ఉల్లిపొట్టు వల్ల కలిగే ప్రయోజనాలు..: కొన్నిసార్లు అలర్జీల వల్ల పాదాలు దురద పెడుతుంటాయి. అలాంటప్పుడు ఉల్లి, వెల్లుల్లి పొట్టును గోరువెచ్చని నీటిలో వేసి పాదాలను ఆ నీటిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపొట్టులోని యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

నిద్రలేమిని దూరం చేసే గుణం..: పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఇతరత్ర కారణాల వల్ల ఈ మధ్య చాలా మందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు ఉల్లిపొట్టుతో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో ఉల్లిపాయ తొక్కలను వేసి మూడు నిమిషాలు మరగనివ్వాలి. అందులోకి కాస్త నిమ్మకాయరసం, తేనె కలిపి టీ లాగా ఆస్వాదించవచ్చు. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుందని నిపుణులు అంటున్నారు.

పాదాలు పగులుతున్నాయా? - ఈ టిప్స్​తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!

గుండె సంబంధింత వ్యాధులు మాయం: ఉల్లిపాయ తొక్కలను మరిగించిన నీళ్లు క్రిమిసంహారకంగా పనిచేస్తాయి. ఇవి గొంతులోని నొప్పి, మంటను తగ్గిస్తాయి. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు, గొంతు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. ఈ నీటిని మరగబెట్టి వడకట్టి తాగడం ద్వారా గుండె సంబంధిత జబ్బులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉల్లిపొట్టులో విటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతి వంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

జుట్టు మృదువుగా..: ఉల్లిపాయ జుట్టుకు ఎంత మేలు చేస్తుందో మనందరికి తెలిసిందే. అలానే ఉల్లిపొట్టు కూడా జుట్టుకు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపొట్టును నీటిలో నానబెట్టి ఆ నీటితో తల స్నానం చేస్తే జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా అవుతుందని చెబుతున్నారు.

మొక్కలకూ మంచిదే: ఉల్లిపొట్టు మనుషులకు మాత్రమే కాదు మొక్కలకు కూడా మంచిదే అంటున్నారు. దీన్ని మొక్కలకు కంపోస్ట్ ఎరువుగా కూడా వాడవచ్చని తెలియజేస్తున్నారు. ఉల్లిపొట్టు మొక్కలను చీడ పీడల నుంచి కాపాడి, మంచి దిగుబడికి దోహదం చేస్తుందని అంటున్నారు. కాబట్టి, ఇప్పటి నుంచి ఉల్లిపాయలను కోసినప్పుడు పొట్టును బయట పరేయకుండా వాడుకోండి.

బ్రేక్ ఫాస్ట్​లో గుడ్డు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

కండరాలు పట్టేస్తున్నాయా? ఎక్కువ దూరం నడవలేకపోతున్నారా? ఈ ఫుడ్స్​తో రిలీఫ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.