ETV Bharat / sukhibhava

స్తంభన సమస్యా..? ఈ ఆహారంతో చెక్​!

author img

By

Published : Mar 3, 2022, 7:24 AM IST

Health tips for Sex: లైంగికపరంగా పురుషుల్లో వచ్చే సమస్యల్లో ప్రధామైనది అంగస్తంభన. దీని గురించి ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతారు కొందరు. ఈ సమస్యపై వైద్యులను సంప్రదించేందుకు కూడా ఇష్టపడరు. అయితే రోజు తినే ఆహారంలో కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా స్తంభన లోపాన్ని తగ్గించుకోవని నిపుణులు చెబుతున్నారు.

Health tips for Sex
Health tips for Sex

Health tips for Sex: పురుషులు సాధారణంగా ఎదుర్కొనే శృంగార సమస్యలో అంగస్తంభన లోపం ఒకటి. ఈ సమస్య వల్ల శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఈ సమస్య ఉన్నవారిలో కలయిక సమయంలో ఎక్కువ సేపు అంగం స్తంభించదు. దీని గురించి వైద్యులతో చెప్పుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. అయితే ఈ సమస్యను కొన్ని ఆహార పదార్థాలతో చెక్​ పెట్టవచ్చు.

ఆహారంలో పండ్లు, కూరగాయలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజ పప్పులు, మసాలాలు, చేపలు, రొయ్యల వంటి సముద్ర ఆహారం, ఆలివ్‌ నూనె ప్రధానంగా ఉండేలా చూసుకోండి. పాలు, పాల పదార్థాలు, గుడ్లు, ఛీజ్‌ మితంగా.. మాంసం అరుదుగా తినండి.

మిఠాయిలు, తీపి పానీయాలు, ప్యాకెట్లలో అమ్మే మాంసం ఉత్పత్తుల జోలికి అసలే వెళ్లకండి.

మధ్యధరా సముద్రం చుట్టుపక్కల దేశాల్లో ఒకప్పుడు తినే ఇలాంటి ఆహార పద్ధతితో పురుషుల్లో స్తంభన లోపం తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ ఏథెన్స్‌ అధ్యయనం పేర్కొంటోంది. మధ్యవయసులో అధిక రక్తపోటు, స్తంభన లోపంతో బాధపడేవారికిది బాగా ఉపయోగపడుతుండటం విశేషం. ఈ ఆహార పద్ధతి రక్తనాళాల పనితీరును మెరుగు పరచటం, టెస్టోస్టీరాన్‌ తగ్గకుండా చూడటం ద్వారా మేలు చేస్తోందని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ స్థాయులు మాత్రమే కాదు.. వ్యాయామ సామర్థ్యమూ ఇనుమడిస్తున్నట్టు తేలింది. ఆహార నియమాలతో పాటు ఉప్పు తగ్గించటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిదనీ పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: శృంగారం వల్లే వాళ్లు అంత అందంగా ఉంటారట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.