ETV Bharat / sukhibhava

ఈ చిట్కాలతో జుట్టు, చర్మ సమస్యలకు చెక్​!

author img

By

Published : Mar 14, 2022, 8:15 AM IST

hair and skin care
చర్మ

Hair and Skin Care: ప్రతి ఆరోగ్య సమస్యకు ఆస్పత్రులకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. వంటిల్లే కేంద్రంగా ఎన్నో సమస్యలకు సులువుగా చెక్​ పెట్టొచ్చు. జుట్టు, చర్మ సమస్యల కోసం ఈ వంటింటి చిట్కాలతో మెరుగైన ఫలితాలు లభిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Hair and Skin Care: వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం మన చర్మం, జుట్టు మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం కోసం చాలా మంది వివిధ రకాల మందులు వాడుతుంటారు. ఫలితంగా.. వారిలో దుష్ప్రభావాల బారిన పడిన వారే ఎక్కువ. ఇందుకు భిన్నంగా.. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే జుట్టు, చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఆ చిట్కాలు ఏంటో చూసేయండి మరి..

చర్మానికి సంబంధించిన చిట్కాలు..

  • చర్మం మెరుపు కోసం - వెన్నకు గుడ్ల సొన కలిపి క్రీమ్​లా తయారు చేయండి. ఈ మిశ్రమంతో మీ ముఖానికి మర్దన చేయాలి. దీని వల్ల మీ ముఖంలో గ్లో వస్తుంది.
  • మొటిమలు - జాజికాయ పొడి, చందనం, మిరియాల పొడి సమపాళ్లలో కలిపాలి. అవసరమైతే మిరియాల పొడిని మితంగా వేసుకోవచ్చు. ఈ మిశ్రమానికి పాలు కలిపి పేస్ట్​లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇది మీ మొటిమల సమస్యను తొలగిస్తుంది.
  • చర్మ సమస్యలు - ఉసిరికాయ పొడి, వేపాకు పొడికి నెయ్యి కలిపి తాగితే అలర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉసిరికాయ పొడిని బెల్లంతో కలిపి కూడా వాడవచ్చు. అల్లం రసం, బెల్లం మిశ్రమం కూడా ఫలితాన్ని ఇస్తుంది.
  • చర్మ వ్యాధులు - వేప పొడి, హరాడ్ పొడి, ఉసిరికాయ పొడి మిశ్రమాన్ని నెలపాటు తీసుకుంటే అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గేందుకు సహాయపడుతుంది. వేప ఆకులు లేదా ఉసిరికాయ పడిగడుపున తినటం మంచిది.
  • ఆయిలీ స్కిన్​ కోసం - కొబ్బరి పాలతో ముఖానికి మర్దన చేయాలి. ఇది మీ ముఖంపై జిడ్డును పోగొడుతుంది.

జుట్టు కోసం చిట్కాలు..

  • చుండ్రు సమస్య - పాలలో గసగసాలు కలిపి ఒక హెయిర్​ ప్యాక్​ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి కొంత సమయం ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చుండ్రు తొలగిపోతుంది.
  • జట్టు నెరవటం - ముక్కు ద్వారా రెండు చుక్కల ఆవ నూనెను తీసుకోండి. ఇది మీ జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది.
  • రింగ్ వామ్​​ - సల్ఫర్​, సెసమీ నూనెను రాయటం వల్ల రింగ్​ వామ్​ సమస్య తగ్గుతుంది.
  • జుట్టు రాలటం - మందార పూలతో ఆవు మూత్రాన్ని కలిపి వాడటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుంది.

ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోవచ్చని.. వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నిర్మలా దేవి చెబుతున్నారు. సాధారణంగా వచ్చే సమస్యలకు సహజ పద్ధతిలో చికిత్స చేసుకోవాలనుకునే వారికి ఇవి ఉత్తమమైన చిట్కాలని ఆమె అన్నారు.

ఇదీ చూడండి : ఇలా డైటింగ్ చేస్తే.. సులువుగా బరువు తగ్గొచ్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.