ETV Bharat / sukhibhava

శృంగారంతో ఆ ఆరోగ్య సమస్యలన్నీ మాయం!

author img

By

Published : Apr 13, 2022, 4:28 AM IST

Updated : Apr 13, 2022, 5:24 AM IST

శృంగారంతో ఆనందం, సంతోషం, ఉత్సాహం చేకూరుతాయన్నది మనకు తెలిసిందే. ఒత్తిడి దూరమవ్వడం, రోగనిరోధక శక్తి పెరగడం సహా మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తరచూ శృంగారంలో పాల్గొనడం ద్వారా కొన్ని జబ్బులకు కూడా చెక్​ పెట్టొచ్చంట. అవేంటో చూద్దాం..

romance benefits
romance benefits

సెక్స్ అంటే కేవలం శారీరక ఆనందం కోసం మాత్రమే కాదు. తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం శారీరకంగా ఆరోగ్యకరమైనది. సెక్స్​ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తెలివితేటలు కూడా పెరుగుతాయట. మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెక్స్​లో పాల్గొనడం వల్ల బ్రెయిన్​కు ఆక్సిజన్​ ఎక్కువగా చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ చేయడం వల్ల అనేక వ్యాధులు మీ దగ్గరికి కూడా రావు. అవేంటో తెలుసుకుందాం.

సెక్స్​ చేయడం వల్ల ఒంట్లో కొవ్వు తగ్గుతుందని.. ఇమ్యూనిటీ పెరగడానికి కూడా దోహదం చేస్తుందని పలు అధ్యయనాలు గతంలో పేర్కొన్నాయి. శృంగారం చేయడం వల్ల గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుందని తేలింది. పలు వైరస్​ల బారి నుంచి ఎదుర్కొవడానికి సెక్స్​ సహకరిస్తుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి ఆ కార్యం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. వారంలో ఒకసారి లేదా రెండు సెక్స్​ చేసుకునే వారిలో రోగ నిరోధక శక్తి పెరిగిందని రీసెర్చ్​ ద్వారా తేలింది.

జలుబు రాకుండా కూడా శృంగారం కాపాడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే యువతీ యువకుల లాలాజలంలో.. జలుబుతో పోరాడే యాంటీబాడీలో పెద్దమొత్తంలో ఉంటాయంట. తరచూ తలనొప్పి సమస్యను ఎదుర్కొనే వారికి సెక్స్ ఒక ఔషధంగా పని చేస్తుందట. ప్రేరేపణ సమయంలో శరీరంలో స్రవించే ఆక్సిటోసిన్ పరిమాణం సుమారు ఐదు రెట్లు పెరుగుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీంతో తలనొప్పితో సహా అనేక నొప్పులను ఇది తగ్గిస్తుంది. కనుక సెక్స్​ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

ఇదీ చదవండి: వీర్య కణాలు తగ్గాయా .. అయితే ఈ టిప్స్​ పాటించండి

Last Updated : Apr 13, 2022, 5:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.