ETV Bharat / sukhibhava

6 యోగాసనాలతో పని ఒత్తిడి మాయం! ఆఫీస్​లోనే కుర్చీలో ఈజీగా వేసేయండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 6:39 AM IST

6 Yoga Asanas To Reduce Office Stress : ఉదయాన్నే లేచి త్వ‌ర‌గా రెడీ అయి.. ఆఫీసుకెళ్లి ప‌నిచేసి ఇంటికొచ్చే స‌రికి అల‌సిపోతాం. కొన్ని సార్లు అటు ఇళ్లు, ఇటు ఆఫీసు ప‌నుల వ‌ల్ల కొన్ని సార్లు విప‌రీత‌మైన ఒత్తిడి ఉంటుంది. అయితే ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఈ ఆరు యోగాస‌నాలున్నాయి. వీటిని మ‌న వ‌ర్క్ బ్రేక్​లో కూడా ట్రై చేయ‌వ‌చ్చు. అవేంటంటే?

6 Yoga Poses To Reduce Office Stress
6 Yoga Poses To Reduce Office Stress

6 Yoga Asanas To Reduce Office Stress : ప్రస్తుతం కాలంలో నిద్ర లేవడం.. త్వరగా రెడీ అయ్యి ఆఫీస్​కు పోవడం.. మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చి డైలీ పనులు చేసుకోవడం.. ఇదే అనేక మంది రొటీన్​ లైఫ్​. కొన్నిసార్లు ఆఫీస్​ పనులు ఎక్కవగా ఉండడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో శారీరకంగానే కాకుండా మానసికంగాను ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఒత్తిడిని దూరం చేసి మ‌ళ్లీ ఎన‌ర్జీని ఇచ్చేందుకు సాయ‌ప‌డే యోగాసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు
ఏంటో చూద్దాం.

1. సీటెడ్ క్యాట్ - కౌ స్ట్రెచ్‌
ముందుగా మీరు కూర్చున్న చోటనే రెండు చేతులో జోడించి.. ముందుకు స్ట్రెచ్ చేయండి. ఆ స‌మ‌యంలో ఊపిరి పీల్చుకోండి. త‌ర్వాత చేతుల్ని వెన‌క్కి తీసుకునేట‌ప్పుడు శ్వాస వ‌ద‌లండి. ఈ స‌మ‌యంలో వీపును కూడా ముందుకు వెన‌క్కి వంచాల‌ని గుర్తుంచుకోండి. ఈ ఆస‌నం వల్ల వెన్నెముకపై ఒత్తిడి త‌గ్గుతుంది. మ‌న భంగిమ‌ను సైతం మెరుగుప‌రుస్తుంది.

2. ఛైర్ పీజియ‌న్ పోస్‌
దీన్నే కుర్చీ క‌పోత‌నస‌న ఆస‌నం అని కూడా అంటారు. మీరు కూర్చున్న చోటు నుంచే ఇది ట్రై చేయ‌వ‌చ్చు. కుర్చీలో కూర్చుని ఉన్న‌ప్పుడు ఒక కాలి మీద మ‌రో కాలు వేసుకోవాలి. ఒక కాలి మ‌డ‌మ మ‌రో కాలి మోకాలు వ‌చ్చేలా ఉండాలి. త‌ర్వాత మోకాలిపై సున్నితంగా నొక్కుతూ ఉండండి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే అసౌక‌ర్యం నుంచి మ‌న‌కు విముక్తి క‌ల్పించ‌డంలో ఇది సహాయపడుతుంది.

3. సీటెడ్ ఫార్వార్డ్ ఫోల్డ్
కుర్చీపై కూర్చుని మీ రెండు కాళ్ల‌ను ముందుకు చాపండి. త‌ర్వాత రెండు చేతుల‌తో పాదాల్ని అందుకోండి. ఆ స‌మయంలో మీ త‌ల మోకాళ్ల‌ను తాకేలా ఉండాలి. ఈ స్ట్రెచ్​తో వెన్నుపూస కింద భాగం, తొడ కండ‌రాల్లో ఉన్న నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

4. నెక్ అండ్ షోల్డ‌ర్ రిలీజ్
మీ రెండు చేతుల్ని జోడించి వాటిని త‌ల వెనుక ఉంచండి. త‌ర్వాత వాటితో మీ త‌ల‌ను మెల్ల‌గా కిందికి అంతే ఛాతీ వైపున‌కు వంచండి. మ‌ళ్లీ అలాగే మీద‌కు చేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీ మెడ వెన‌క భాగంలో సాగిన‌ట్లు అనిపిస్తుంది. ఫ‌లితంగా అక్కడి నొప్పి పోతుంది. రెండు చేతుల్ని అటు ఇలూ అన‌డం ద్వారా భుజాల‌పై ఉండే భారం సైతం త‌గ్గుతుంది.

5. సీటెడ్ స్పైన‌ల్ ట్విస్ట్
కుర్చీలో కూర్చుని ఉన్న‌ప్పుడు.. రెండు కాళ్లు నిటారుగా ఉంచండి. త‌ర్వాత ఒక చేత్తో కుర్చీపై భాగాన్ని ప‌ట్టుకుని మెల్ల‌గా మీ శ‌రీరాన్ని తిప్పాలి. ఇంకో చేతి స‌పోర్టుతో బాడీని సాగ‌దీయండి. ఈ భంగిమ వెన్ను ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటమే కాక‌.. వెన్నెముక ఆరోగ్యానికి తోడ్ప‌డుతుంది.

6. డీప్ బ్రీతింగ్
హాయిగా కళ్లు మూసుకుని కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీ పొత్తి క‌డుపు తాకేలా ముక్కుతో శ్వాస‌ లోప‌లికి పీల్చుకోండి. త‌ర్వాత మెల్ల‌గా దాన్ని నోటితో బ‌య‌టికి వ‌ద‌లండి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు కామ్ నెస్ వచ్చి.. ఒత్తిడి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. అందుకే పైన చెప్పిన వాటిని వ‌ర్క్ టైమ్​లో ఒక‌సారి ట్రై చేయండి.

ఈ 3 ఆసనాలతో BP కంట్రోల్! ఈజీగా చేసేయండిలా!!

Mental Stress Relief Tips Telugu : మానసిక ఒత్తిడికి గురవుతున్నారా.. ఈ లక్షణాలున్నాయా.. ఐతే ఇలా చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.