ETV Bharat / state

Funny Tweet: "కొరియర్​​ వస్తే సర్​ప్రైజ్​ గిఫ్ట్​ అనుకున్నా.. ఓపెన్​ చేశాక షాకయ్యా"

author img

By

Published : Mar 6, 2022, 12:44 PM IST

pamela satpathy funny tweet on amazon order
పమేలా సత్పతి అమెజాన్​

Collector Pamela Satpathy Funny tweet on Surprise gift: "మనకు సంబంధించి ఏవైనా ప్రత్యేక రోజులు వస్తున్నాయంటే.. ఎవరికైనా ఏదో తెలియని నూతనోత్సాహం మొదలవుతుంది. పుట్టినరోజు, పెళ్లి రోజు ఏదైనా కావచ్చు.. ఎంత వద్దనుకున్నా మనల్ని ఇష్టపడే వారి నుంచి ఓ సర్​ప్రైజ్​ ఆశిస్తాం. ఇక మహిళలకు సంబంధించి ఏడాదికోసారి ఓ ప్రత్యేక రోజు ఉండనే ఉంది. ఆ రోజు ప్రతి మహిళా.. తన కుటుంబసభ్యుల నుంచి ఓ ప్రత్యేకతను కోరుకుంటుంది. ఇది సాధారణ ప్రజలకే కాదు ప్రముఖులకూ వర్తిస్తుంది. మన ఇంటికి ఏదైనా కొరియర్​​ వచ్చినా.. అది మనల్ని సర్​ప్రైజ్​ చేయడానికే అనుకుంటాం. అలా అనుకొనే చివరికి అవాక్కయ్యారు.. యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతి. ఆ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ఫన్నీగా పంచుకున్నారు.

Collector Pamela Satpathy Funny tweet on Surprise gift: "గురువారం రోజు మా ఇంటికి ఓ కొరియర్​​ వచ్చింది. ఆ పెద్ద ప్యాకెట్​ చూడగానే.. మరో రెండు రోజుల్లో మహిళా దినోత్సవం ఉంది కదా.. నా ఆత్మీయులు నా కోసం సర్​ప్రైజ్​ గిఫ్ట్​ పంపించారేమో అనుకున్నా. ఆనందం పట్టలేక.. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆతృతతో ప్యాకెట్​ ఓపెన్​ చూసి చూశాను. ఓపెన్​ చేశాక అందులో ఉన్నది చూసి షాకయ్యాను. అప్పుడు వెలిగింది నాకు.. వారం రోజుల క్రితం అమెజాన్​లో ఆర్డర్​ పెట్టింది ఈ రోజు వచ్చింది అని.".. ఆ ఫన్నీ మూమెంట్​ను ట్విట్టర్​ ద్వారా మనతో పంచుకున్నారు యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతి.

ఆ ప్యాకెట్​లో ఏముందంటే..

ఇంతకీ ఆ ప్యాకెట్​లో ఏముందంటే.. కలెక్టర్​ వారం కిందట అమెజాన్​లో ఆర్డర్​ చేసిన క్వార్టర్​ లీ డైపర్​ ఉంది. కలెక్టర్​ పమేలాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇటీవలే రాయగిరి అంగన్​వాడి కేంద్రంలో బాబు పేరు నమోదు చేశారు. తన బాబుకు డైపర్ల కోసం కలెక్టర్​ ఆన్​లైన్​లో ఆర్డర్​ పెట్టారు. అది గురువారం ఇంటికి డెలివరీ వచ్చింది. ఆ విషయం మరిచిపోయిన కలెక్టర్.. తనకు ఉమెన్స్​ డే సర్​ప్రైజ్​ గిఫ్ట్​ వచ్చిందనుకుని కాసేపు ఊహల్లో తేలిపోయారు. పమేలా సత్పతి.. ట్విట్టర్​లో తాను ఫన్నీగా రాసిన ఈ రైటప్ అందరినీ ఆకర్షించింది. మీకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి కదా..

  • Today I opened the huge packet from Amazon with an unbound excitement & instinctual certainty that, "It must be my Women's Day surprise gift 🤩!"

    Turned out it was the quarterly Diaper Pack I had ordered a week back😩#NotSoFunny#MamaAndMomo#momlife

    — Pamela Satpathy (@PamelaSatpathy) March 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: బకెట్‌ విధానంతో డిగ్రీ విద్య.. ఎన్ని రకాల కాంబినేషన్లో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.