ETV Bharat / state

యాదాద్రిలో  ఘనంగా ఊంజల్​ సేవ

author img

By

Published : Dec 19, 2020, 10:52 AM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక ఊయలపై అధిష్ఠింపజేసి వివిధ రకాల ఆభరణాలతో అర్చకులు అలంకరించారు. మేళ,తాళాల నడుమ ఈ క్రతులు శాస్త్రోక్తంగా కొనసాగింది.

unjal-festivals-are-celebrated-in-yadadri
యాదాద్రిలో ఘనంగా ఊంజల్​ ఉత్సవాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో ఆండాళ్ అమ్మవారి ఊంజల్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని ప్రత్యేక ఊయలపై అధిష్ఠింపజేసి వివిధ రకాల ఆభరణాలను అలంకరించారు. మేళ,తాళాల నడుమ ఈ క్రతువు కొనసాగింది. వేకువజామునే ఆలయాన్ని తెరిచి శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. ప్రతిష్ఠా మూర్తులను సుగంధ ద్రవ్యాలు, శుద్ధ జలం, ఫల రసాలతో అభిషేకించారు. ప్రత్యేక మంగళ హారతులతో వివిధ లాలి పాటలతో మన్య సూక్త పఠణాలతో సుమారు గంట పాటు ఈ ఉత్సవం జరిగింది.

ఇదీ చదవండి : 'చరిత్రగల ఆలయాల కీర్తిని ప్రపంచానికి చాటిచెబుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.