ETV Bharat / state

యాదాద్రిలో రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం

author img

By

Published : Feb 15, 2021, 7:56 PM IST

యాదాద్రి కొండపై ఉన్న శివాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిపారు. పంచామృతాలతో శివలింగానికి అభిషేకం జరిపి... అలంకరించారు.

ramalingeswara-rudrabhishekam-in-yadadri-yadadri-bhuvanagiri-district
యాదాద్రిలో రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి కొండపై ఉన్న రామలింగేశ్వర స్వామికి సోమవారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఈ పూజల్లో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. ఉదయం నుంచే పరమశివుడిని కొలుస్తూ సుమారు గంటన్నరపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పంచామృతాలతో శివలింగానికి అభిషేకాలు జరిపి... అలంకరించారు. సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయ స్వామి, నాగ దేవత విగ్రహాలకు అభిషేకాలు జరిపి అర్చనలు చేశారు.

ఇదీ చదవండి: అప్పుడు కరోనా.. ఇప్పుడు మౌఢ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.