ETV Bharat / state

నేటి నుంచి ఆన్​లైన్​లో యాదాద్రీశుడికి పూజలు

author img

By

Published : Apr 21, 2020, 5:53 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పూజలు ఆన్​లైన్​లో అందుబాటులోకి తీసుకొచ్చింది దేవాదాయ శాఖ. ఈ సేవలు నేటి నుంచే అమలులోకి రానున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

online pujas are started in yadadri bhuvanagiri yadagirigutta temple
నేటి నుంచి ఆన్​లైన్​లో యాదాద్రీశుడికి పూజలు

కరోనా మహమ్మారిని కట్టడిచేయడానికై అన్ని దేవాలయాలు, మత ప్రచార సంబంధమైన ప్రదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూసేశాయి. ఈ నేపథ్యంలో భక్తుల అభీష్టం మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ సూచనలను అనుసరించి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆర్జిత సేవలలో భక్తులు పరోక్షంగా ఆన్​లైన్​ ద్వారా పాల్గొనే వెసులుబాటును కల్పించినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనందున భక్తులకు గోత్రనామాలతో పరోక్షంగా దేవాలయం నందు పూజలు నిర్వహించుటకు వీలు కల్పించారు. ఈ దిగువ చూపిన సేవలు నేటి నుంచి పరోక్ష పద్ధతిన పూజలు నిర్వహించబడును.

  • శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి నిజాభిషేకం రూ. 500
  • శ్రీయాదాద్రీశునికి సహస్రనామార్చన రూ. 500
  • శ్రీ స్వామివారి సుదర్శన నారసింహ హోమం రూ. 1,116
  • శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన రూ. 500

వెబ్ సైట్ వివరాలు https://ts.meeseva.telangana.gov.in

పై పూజలు నిర్వహించ ఆసక్తిగల భక్తులు ఆన్​లైన్ ద్వారా వారి పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్​లైన్​ పద్ధతిన నిర్ణీత సొమ్ము చెల్లించి స్వామి వారి సేవలో పాల్గొని ఆయన కృపకు పాత్రులయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.