ETV Bharat / state

యాదాద్రిలో సందడి చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఇంటిలో పని చేసే యువకుడి పెళ్లికి హాజరు

author img

By

Published : Dec 4, 2022, 7:19 PM IST

Kalvakuntla kavitha visit to Yadadri: తెలంగాణకు శ్రీరామరక్షగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తన ఇంట్లో పనిచేసే మహేష్‌ అనే యువకుడి పెళ్లికి హాజరైన కవిత నూతన వధువరులును ఆశిర్వదించారు.

Kalvakuntla kavitha
Kalvakuntla kavitha

Kalvakuntla kavitha visit to Yadadri: ఈరోజు యాదాద్రిలో నిర్మించిన ఆలయం మన తెలంగాణకు కాకుండా యావత్ భారతదేశం మొత్తం ఎంతో సగర్వంగా చెప్పుకుంటదని ఎమ్మెల్సీ కవిత హర్షం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జడ్పీటీసీ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు జిల్లాలో మంచి ఆదరణ పొందిన నేతగా ఎదిగిన సునీత ప్రస్థావనను ఆమె అభినందించారు. తెలంగాణకు శ్రీరామరక్షగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. జిల్లాలోని ఆలేరులో తమ ఇంటి వద్ద పనిచేసే మహేశ్‌ అనే యువకుడి పెళ్లికి హాజరైన కవిత నూతన వధువరులను ఆశీర్వదించారు.

"యాదాద్రి ఆలయ నిర్మాణం తెలంగాణకే కాకుండా యావత్‌ ప్రపంచానికి తలమానికంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్చిదిద్దారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు ఉద్యమంలోను ఇటు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఇది చాలా సంతోషకరం. ఎన్ని పార్టీలు వచ్చి ఇబ్బందులకు గురిచేసిన ప్రజలు కేసీఆర్ వైపు నడవటం చాలా సంతోషం. యాదాద్రి జిల్లాలో 2001 నుంచి జడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగి ఇప్పటికీ విజయ ప్రస్థానం కొనసాగిస్తున్న సునీతా రాజకీయ ప్రస్థానం మనందరికీ ఆదర్శం".- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ

యాదాద్రిలో సందడి చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఇంటిలో పని చేసే యువకుడి పెళ్లికి హాజరు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.