ETV Bharat / state

మునుగోడు ఉపఎన్నికపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 15 ప్రశ్నలు సంధించిన కేఏ పాల్

author img

By

Published : Nov 8, 2022, 4:05 PM IST

Updated : Nov 8, 2022, 6:53 PM IST

KA Paul press meet in Chandur mandal
ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్

KA Paul asked 15 questions: మునుగోడు ఉపఎన్నికలో తనదైన శైలిలో ప్రచారం చేసిన.. కేఏ పాల్​కు ఓటమి తప్పలేదు. అందరి కంటే వినూత్నంగా రోజుకోక వేషంలో తన ప్రచారాన్ని సాగించారు. ఈ ఎన్నికలో తనదే గెలుపు.. మునుగోడును అమెరికా చేస్తాను అనే వాగ్దానాలు చేసినా ప్రజలు గులాబీకే పట్టం కట్టారు. అయితే ఈ పోరాటంతో తన ఓటమిని పాల్ ఒప్పుకోలేదు. ఉపఎన్నికపై 15 ప్రశ్నలను కేఏ పాల్ కేసీఆర్​, ఎన్నికల సంఘంపై కురిపించారు.

KA Paul asked 15 questions: కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకోవడం అంటే ఇక్కడి భూములు ఆక్రమించడం, అమ్ముకోవడం, లక్షల కోట్లు అప్పు చేయడం దాని అర్థమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ విమర్శించారు. చండూర్ మున్సిపాలిటీలోని అమరవీరుల స్థూపం వద్ద కేఏ పాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 15 ప్రశ్నలను ఎలక్షన్​ కమిషన్​కు, కేసీఆర్​కు సంధించారు.

ఈవీఎంలతో కాకున్నా బ్యాలెట్ పేపర్​నే ఎన్నికకు ఉత్తమం అని పాల్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి బ్యాలెట్ పేపర్​తో ఎన్నిక నిర్వహించమని కోరితే అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు అంతా కలిసి ఈవీఎంలతో డ్రామాలు చేశారని మండిపడ్డారు. ఎన్నిక పోలింగ్​ ముగిసిన అనంతరం ఎందుకు లెక్కింపు ప్రక్రియ చేపట్టలేదన్నారు. ఎన్నికల అధికారులు మొత్తం కేసీఆర్​ తొత్తులుగా మారిపోయారన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల దగ్గర నిఘా గురించి ఏర్పాటు చేసే సీసీ కెమెరాల పుటేజ్​ల లింక్​లను ఎందుకు తమకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

అంటే ఇక్కడ ఈవీఎంల మార్పిడి జరిగిందని అర్థమవుతుందని ఆరోపించారు. అలాగే స్ట్రాంగ్ రూమ్​కు వేసినా సీల్ మారిపోయిందన్నారు. తెరాస ఏజెంట్లు కండువాలు కప్పుకుని కౌంటింగ్ హాల్​లో ఎందుకు ఉన్నారని ప్రశ్నలు లేవనెత్తారు. పోలింగ్​ స్టేషన్​లోకి వచ్చిన వృద్ధులతో ఈవీఎంలో ఉన్న రెండో నంబర్​కు పోలింగ్​ సిబ్బంది ఓటు వేయించారని పేర్కొన్నారు. ఓటుకు డబ్బులు పంచడం అనేది ఎన్నికల అధికారులకు తెలిసి కూడా ఎందుకు ఈ ఎన్నిక నిర్వహించారని ప్రశ్నించారు. వెంటనే ఈ ఎన్నికను రద్దు చేయాలని ఎలక్షన్​ కమిషన్​ను కోరారు. త్వరలోనే అన్ని సాక్ష్యాధారాలతో దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మునుగోడు ప్రజలు కేసీఆర్​ను ఛీ కొడుతున్నారు.. నన్ను అభిమానిస్తున్నారని తన ఆఖరి పంచ్​ డైలాగ్​తో అదరగొట్టారు.

ఎలక్షన్ అధికారులు అంతా కలిసి ఈవీఎంలో మార్పులు చేశారు . ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమని చెప్పిన అధికారులు పట్టించుకోలేదు. ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఎందుకు కౌంటింగ్ చేయలేదు. అధికారులు మొత్తం కేసీఆర్​కి తొత్తులుగా పని చేశారు. సీసీ కెమెరాలు సంబంధించిన లింక్ మాకు ఎందుకు ఇవ్వలేదు. స్ట్రాంగ్ రూమ్ కు వేసినా సీల్ మారింది. పోలింగ్ స్టేషన్ లో వృద్ధులతో రెండో నెంబర్ కు పోలింగ్ సిబ్బంది ఓటు వేయించారు. ఓటుకు డబ్బులు పంచడం అనేది ఎలక్షన్ అధికారులతో పాటు అందరికి తెలిసి కూడా ఎందుకు రద్దు చేయలేదు. కేటీఆర్ దత్తత తీసుకోవడం అంటే ఇక్కడి భూముల ఆక్రమించడం, అమ్ముకోవడం, లక్షల కోట్లు అప్పు చేయడమే దీని అర్థం. - కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

చండూరు మండలంలో కేఏ పాల్ మీడియా సమావేశం

ఇవీ చదవండి:

Last Updated :Nov 8, 2022, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.