ETV Bharat / state

Fit india: 'కరోనా బాధితుల్లో మనో ధైర్యాన్ని నింపాలి'

author img

By

Published : May 30, 2021, 2:55 PM IST

fit india foundation awareness program in jai kesaram village
జైకేసారం గ్రామంలో ఫిట్​ ఇండియా ఫౌండేషన్​ అవగాహన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా జై కేసారం గ్రామంలో ఫిట్​ ఇండియా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైరస్​ కట్టడికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఫౌండేషన్​ ఉపాధ్యక్షులు తలారి గణేష్​ విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనా బారిన పడకుండా ఉండాలని ‘ఫిట్ ఇండియా ఫౌండేషన్’ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు తలారి గణేష్ సూచించారు. పలుమార్లు శానిటైజర్​తో చేతులు కడుక్కోవాలని పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలో.. కరోనా మహమ్మారి పట్ల ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గణేష్​ విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సోకిందన్న అనుమానంతో ఊళ్లో ఎవరూ మాట్లాడటం లేదని గ్రామానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం తనను ఎంతో బాధించిందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలను చైతన్య పరచాలని, కొవిడ్ బాధితుల్లో మనోధైర్యాన్ని నింపాలని సర్పంచ్, ప్రజాప్రతినిధులకు తలారి గణేష్ సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సైదులు, ఉప సర్పంచ్ యమున యాదగిరి, ఎంపీటీసీ సభ్యులు శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: FOOD: యాంటీ వైరల్‌ ఆహారం తిందామా.. ఆరోగ్యాన్ని రక్షించుకుందామా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.