ETV Bharat / state

అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తా.. : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

author img

By

Published : Apr 12, 2022, 1:54 PM IST

mp komatireddy venkatreddy interview: కాంగ్రెస్‌ స్టార్ క్యాంపెయినర్‌గా తనను నియమించటం పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తానని ప్రకటించారు. అధికార పార్టీ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెబుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Bhongir mp komatireddy venkatreddy
Bhongir mp komatireddy venkatreddy

mp komatireddy venkatreddy interview: పార్టీలోని సీనియర్లు, జూనియర్లను సమన్వయం చేసుకుని గెలుపునకు కృషి చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమితులైన తాను ...అధికార పార్టీ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. జనాలు చెప్పిన అంశాలతో మేనిఫెస్టో రూపొందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్‌ కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. తెరాస పాలనలో ఎంతమంది పేదలకు ఇళ్లు వచ్చాయని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ గెలిస్తే ఏమి చేస్తామన్నది జనంలోకి తీసుకెళ్లతామని వివరించారు. కాంగ్రెస్‌ లేదని జనంలోకి తీసుకెళ్లేందుకు తెరాస, భాజపా ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి .

ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.