ETV Bharat / state

Bandi Sanjay: 'రైతుల సంక్షేమమే భాజపా ధ్యేయం'

author img

By

Published : Jul 18, 2021, 6:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమంపై కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

'రైతుల సంక్షేమమే భాజపా ధ్యేయం'
'రైతుల సంక్షేమమే భాజపా ధ్యేయం'

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన బండి సంజయ్​కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమంపై కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలకు సంజయ్​ దిశానిర్దేశం చేశారు.

నారసింహుని సేవలో బండి సంజయ్
నారసింహుని సేవలో బండి సంజయ్

అంతర్జాతీయ మార్కెట్​లో ఎరువులు, ముడి సరుకుల ధరలు పెరిగినా.. మోదీ ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఎరువులను అందిస్తోందని బండి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి.. రైతులకు అండగా నిలిచింది భారతీయ కిసాన్ మోర్చా అని ఆయన కొనియాడారు. లాక్​డౌన్ సమయంలోనూ కిసాన్​ మోర్చా నిరుపేద రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.

కేసీఆర్ పెట్టే అక్రమ కేసులకు భయపడేదే లేదు..

మోదీ ప్రభుత్వం అమలు చేసిన కరోనా కట్టడి వ్యూహాలను ప్రపంచ దేశాలు అనుసరించాయని బండి సంజయ్​ పేర్కొన్నారు. కొవిడ్​ విపత్తు సమయంలో ప్రజలు, అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మోదీ చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై తెరాస అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని సంజయ్​ ఆరోపించారు. కేసీఆర్ పెట్టే అక్రమ కేసులకు భయపడేదే లేదన్నారు. రైతుల సంక్షేమమే పార్టీ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం..

అంతకుముందు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని బండి సంజయ్​ దర్శించుకున్నారు. బాలాలయంలో సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన బండి సంజయ్​కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానికి వచ్చిన సమయంలో బండి సంజయ్​ వెంట భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్ర శోభారాణి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, జిల్లా నాయకులు శ్యామ్ సుందర్ తదితరులు ఉన్నారు.

దర్శన అనంతరం బండి సంజయ్​ మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు సంజయ్​ తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో కిసాన్ మోర్చా మొదటి సమావేశం జరగడం సంతోషకరమన్నారు. ఏ రాజకీయ పార్టీ రైతులకు ఉపయోగపడే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయదని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.