ETV Bharat / state

శిథిలావస్థలో కళాశాల... భయం గుప్పిట్లో విద్యార్థులు

author img

By

Published : Jan 10, 2020, 3:13 PM IST

warangal polytechnic college students protest demanding minimum Accommodations
వరంగల్​లో విద్యార్థుల ధర్నా

తమ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్​ చేస్తూ వరంగల్​ ప్రభుత్వ పాలిటెక్నిక్​ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

వరంగల్​లో విద్యార్థుల ధర్నా

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో తాగునీటి వసతి కల్పించాలని కోరారు.

తమ కళాశాలలో సాంకేతిక విద్యను అందించే ల్యాబ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తరగతులు నిర్వహిస్తున్న క్రమంలో పెచ్చులూడి విద్యార్థులు గాయపడ్డారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ కళాశాల భవనాన్ని వేరే చోటుకు మార్చాలని లేకపోతే విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదమని టీఎస్​ఎఫ్​ నాయకులు తెలిపారు.

Intro:TG_WGL_16_10_STUDENTS_ANDOLANA_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు టి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు కళాశాలలో తాగునీటి వసతి తో పాటు మూత్రశాల నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు కళాశాలలో సాంకేతిక విద్యను అందించే ల్యాబ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని విద్యార్థులు వ్యాఖ్యానించారు 1955లో స్థాపితమైన కళాశాల అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దాలని ప్రస్తుతం కళాశాల శిథిలావస్థకు చేరుకుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు తరగతులు నిర్వహిస్తున్న క్రమంలో పెచ్చులూడి విద్యార్థుల గాయపడ్డ ఉన్నాయని భయం గుప్పిట్లో విద్యా పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని విద్యార్థులు ఆవేదనను వెలిబుచ్చారు


Body:ప్రశాంత్


Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.