ETV Bharat / state

అనుకోని కష్టం... మిగిల్చింది అపార నష్టం

author img

By

Published : Aug 20, 2020, 5:18 AM IST

Updated : Aug 20, 2020, 7:40 AM IST

ఉమ్మడి వరంగల్‌లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో...వాగులు వంకల జోరు తగ్గింది. జలమయమైన ప్రధాన రహదారులు కాలనీలు క్రమంగా తేరుకుంటున్నాయి. వరద నీరు తగ్గడంతో.... దెబ్బతిన్న రహదారులు, చెరువులు, కూలిన ఇళ్లు మొదలైన వాటికి సంబంధించి.. నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలను సిద్ధం చేశారు.

roads and crops damaged in warangal
అనుకోని కష్టం... మిగిల్చింది అపార నష్టం

అనుకోని కష్టం... మిగిల్చింది అపార నష్టం

ఎడతెరిపిలేని వాన....ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను వారం రోజుల పాటు....కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు...పొంగి పొర్లుతూ మత్తడి పోశాయి. పది, పదిహేను అడుగుల మేర ప్రవహించడంతో....ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రోడ్లు దెబ్బతినగా....చాలా చోట్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఆర్​అండ్​బీ రోడ్లు 109.3 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీ రోడ్లు.... 53 కిలోమీటర్ల మేర దెబ్బతినగా.....48 పంచాయతీల్లో రోడ్లు 198.58 కిలోమీటర్ల మేర గోతులు పడినట్లు అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లు దెబ్బతినడం వల్ల....123,34,00,000 రూపాయల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.

ముప్పు తెచ్చిన నాలాలు

ప్రవాహానికి మించి నాలాలు ఉప్పొంగి.... మున్సిపల్ నాలాలు 11, సాధారణ నాలాలు 111 దెబ్బతిన్నాయి. మెుత్తం 59,43,00,000 రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 41 చెరువులకు నష్టం వాటిల్లగా...వీటి మరమ్మతులకు...6,23,00,000 రూపాయలు అవుతుందని ప్రాథమికంగా లెక్కలు వేశారు. కుండపోత వర్షాలకు 96 కాలనీలు నీట మునగగా.....25 లక్షల మేర నష్టం వాటిల్లింది. వరదల ముప్పును గ్రహించిన సర్కార్...అన్ని జిల్లా కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. ముంపు బాధితులకోసం...మొత్తం 108 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా....24,098 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తక్షణ అవసరాలకోసం... ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను కేటాయించింది.

పంటలకు భారీ నష్టం

వరదలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లాలో 82,293 ఎకరాల్లో... వరి పంటకు నష్టం వాటిల్లింది. 76వేల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ...సమాచారం ఆందరికీ ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చూడండి: ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే సీతక్క

Last Updated :Aug 20, 2020, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.